- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cm yogi: మహాకుంభమేళాతో రూ.3 లక్షల కోట్ల ఆదాయం.. యూపీ సీఎం యోగీ
మహాకుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.3 లక్షల కోట్లకు పైగా ప్రయోజనం చేకూరుతుందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: మహాకుంభమేళా (Mahakumbha mela)తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.3 లక్షల కోట్లకు పైగా ప్రయోజనం చేకూరుతుందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi aadithya nath) తెలిపారు. యూపీ అసెంబ్లీ (Assembly) సమావేశాల సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే రాగిణి సోంకర్ (Ragini sonkar) అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం ఆరు కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుంచి విముక్తి చేసిందన్నారు. ప్రతి రంగంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఎస్పీ, కాంగ్రెస్ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేశామన్నారు. మహాకుంభమేళా నిర్వహణతో దేశం, ప్రపంచం ఉత్తరప్రదేశ్ సామర్థ్యాన్ని చూస్తున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.3లక్షల కోట్ల ఆదాయం రాబోతుందన్నారు.
‘భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2027 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ముందుకు సాగుతోంది. 140 కోట్ల మంది భారతీయులు దీని పట్ల గర్వపడాలి’ అని తెలిపారు. ఈ పురోగతి కొంత మందికి నచ్చకపోవచ్చని, ఎందుకంటే వారికి వ్యక్తిగత ఎజెండా ఉందని విమర్శించారు. అటువంటి వారికి దేశ అభివృద్ధి ఏ మాత్రం కనిపించబోదని ఆరోపించారు.






