Brahmos: దేశానికి, యూపీకి ఇది చారిత్రాత్మకమైన రోజు : కేంద్రమంత్రి రాజ్‌నాథ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-26 05:36:17  IST  )

భారతదేశ రక్షణ తయారీ సామర్థ్యాలకు గణనీయమైన ప్రోత్సాహాన్నిచ్చే విధంగా, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) లక్నోలో ప్రారంభించారు.

Brahmos: దేశానికి, యూపీకి ఇది చారిత్రాత్మకమైన రోజు : కేంద్రమంత్రి రాజ్‌నాథ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశ రక్షణ తయారీ సామర్థ్యాలకు గణనీయమైన ప్రోత్సాహాన్నిచ్చే విధంగా, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రారంభించారు. దేశానికి, యూపీకి ఇది చారిత్రాత్మకమైన రోజని పేర్కొన్నారు.

లక్నోలో జరిగిన ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్షణ సాంకేతికతలో దేశం యొక్క స్వావలంబనను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయి అని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)లో బ్రహ్మోస్ శక్తి ఏంటో స్పష్టమైందని, బ్రహ్మోస్ ప్రభావం ఎలా ఉంటుందో పాకిస్తాన్ ను అడిగితే తెలుస్తుందన్నారు.

బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ఈ ప్రాంతంలో రక్షణ, ఏరోస్పేస్ పెట్టుబడులకు మద్దతు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ నుండి సీనియర్ అధికారులు, రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, సాయుధ దళాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

Video Link

Next Story