- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతిపై సీఎం విజయ్ సమరం.. సమాచారం ఇచ్చిన వారికి రూ. లక్ష బహుమతి
తమిళనాడులో అవినీతిని అంతమొందించేందుకు సీఎం విజయ్ సరికొత్త ఫిర్యాదుల పోర్టల్, హెల్ప్‌లైన్ తీసుకువస్తున్నారు. లంచాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

దిశ, వెబ్ డెస్క్: గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే విజయ్ (TVK Vijay) తమిళనాడు ముఖ్యమంత్రిగా తనదైన మార్కును చాటుతున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జోసెఫ్ విజయ్ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా తీసుకుంటున్న ముందస్తు నిర్ణయాలు, వ్యూహాత్మక ప్రణాళికల నేపథ్యంలో ఓ వార్త వైరల్ అవుతోంది. తన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 'జీరో కరప్షన్' (Zero Corruption) హామీని నెరవేర్చే దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
సాధారణ పౌరులకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, లంచాలు అడిగినా నేరుగా సీఎంఓ (CMO) కి ఫిర్యాదు చేసేలా ఒక కేంద్రీకృత ఆన్‌లైన్ పోర్టల్, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను తీసుకురావడానికి తమిళపాడే ఐటీ విభాగం కసరత్తు చేస్తోంది. సామాన్య ప్రజలు ఎక్కువగా వెళ్లే సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులు, ఆర్టీవో (RTO) కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసులు, రేషన్ కార్డుల మంజూరు విభాగాలలో లంచాల దందాను పూర్తిగా అరికట్టాలని అధికారులకు సీఎం విజయ్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లంచం అడిగినట్లు ఆధారాలతో సహా దొరికితే ఎంతటి ఉన్నతాధికారి అయినా, తమ పార్టీకి అత్యంత సన్నిహితులైనా సరే ఉపేక్షించేది లేదని, వారిపై తక్షణమే శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన విచారణ (Vigilance Inquiry) జరుపుతామని సీఎంఓ వర్గాలు స్పష్టం చేశాయి.






