ప్రధాని మోదీతో సీఎం విజయ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-27 12:16:23  IST  )

ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తమిళనాడు సీఎం తలపతి విజయ్ భేటీ అయ్యారు.

ప్రధాని మోదీతో సీఎం విజయ్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి తలపతి విజయ్ (Thalapathy Vijay) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హస్తిన వెళ్లిన ఆయన.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పార్లమెంట్ భవనంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ భేటీ అనంతరం సీఎం విజయ్ మరికొందరు కేంద్ర పెద్దలతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

అయితే, కొత్త ముఖ్యమంత్రిగా పదవిని తర్వాత కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన జరుపుతున్న తొలి అధికారిక పర్యటన ఇదే కావడంతో రాజకీయ వర్గాల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ పర్యటన మర్యాదపూర్వకమైనదే అయినప్పటికీ, తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టుల ఆమోదం, కేంద్ర-రాష్ట్ర బంధాన్ని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై సీఎం విజయ్ ప్రధానితో డిస్కస్ చేశారని టీవీకే వర్గాలు తెలిపాయి.

Next Story