SIR కు నిరసనగా రోడ్డెక్కిన సీఎం

by Muthe.Rajitha |

ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)ను వ్యతిరేకిస్తూ.. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రోడ్డెక్కారు.

SIR కు నిరసనగా రోడ్డెక్కిన సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)ను వ్యతిరేకిస్తూ.. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రోడ్డెక్కారు. మంగళవారం మమత ఆధ్వర్యంలో కోల్‌కతాలో 3.8 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించగా వేలాది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని నగరాన్ని బ్లాక్ చేసారు. ఈ సవరణ భాజపా-ఎన్నికల సంఘం కుమ్మక్కై జరుపుతున్న నిశ్శబ్ద రిగ్గింగ్‌ అని టీఎంసీ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు రాజ్యాంగ విరుద్ధంగా టీఎంసీ ప్రవర్తిస్తోందని భాజపా చెబుతూ.. 'లోపాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సింది' అని సవాల్‌ చేసింది.

కాగా నవంబర్‌ 4 నుంచి రెండో దశలో అండమాన్‌ నికోబార్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, కేరళ, లక్షద్వీప్‌, మధ్యప్రదేశ్‌, పుదుచ్చేరి, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌లో 51 కోట్ల మంది ఓటర్ల జాబితా సవీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే బిహార్‌లో ఈ ప్రక్రియ పూర్తి కాగా, ఎన్డీయే మినహా కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు దీనిని 'ఓట్ల చోరీ' అంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Next Story