- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారుల అత్యుత్సాహం.. వివాదంలో సీఎం భార్య!
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గ స్టాలిన్ వివాదంలో చిక్కుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గ స్టాలిన్ వివాదంలో చిక్కుకున్నారు. ఉత్సవ మూర్తులకు ఉపయోగించాల్సిన గొడుగును సీఎం భార్యకు పట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నైలోని ఓ ఆలయంలో జరిగిన వేడుకలకు దుర్గ స్టాలిన్ హాజరయ్యారు. మాడ వీధుల్లో ఉత్సవ మూర్తి ఊరేగింపు జరిగింది. అదే సమయలో వర్షం కురిసింది. దీంతో వర్షంలో తడవకుండా సీఎం సతీమణికి ఉత్సవమూర్తి గొడుగును ఓ అధికారి పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అత్యంత పవిత్రమైన గొడుగును సీఎం భార్యకు వాడటంపై ప్రతిపక్షాలు నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది తమిళనాడు రాష్ట్ర దేవాదాయ శాఖలో జరిగిన అతి పెద్ద తప్పిదంగా బీజేపీ ఆరోపించింది. కాగా ఈ ఘటన కొన్ని రోజుల క్రితం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. కాగా ఈ ఘటనపై అధికార డీఎంకే నేతలు ఎవరూ స్పందించలేదు.
Read More....
భారత్-చైనా సరిహద్దు ఘర్షణ పై రక్షణ మంత్రి అత్యున్నత స్థాయి అత్యవసర సమావేశం
- Tags
- TN CM Stalin






