- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్‌పై సీఎం విమర్శలు.. మరోసారి బయటపడిన అభిప్రాయ భేదాలు
by Naga Rani Yarlagadda |
తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న అభిప్రాయ భేదాలు మరోసారి బయటపడ్డాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న అభిప్రాయ భేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఎంకే స్టాలిన్.. గవర్నర్ రవిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలపై తనకు ఎలాంటి ఆందోళన లేదన్న ఆయన.. కేంద్ర బీజేపీ సర్కార్ నియమించిన గవర్నర్ రవి.. ప్రతిపక్షాలను మించిన చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్ భవన్లో ఉండి అధికార డీఎంకేకు వ్యతిరేకంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రం ప్రతిపాదించిన ఏ బిల్లుల్నీ ఆయన ఆమోదించరని, పైగా తమిళ రాష్ట్ర గీతాన్ని కూడా అగౌరవపరిచే విధంగా నడుచుకున్నారని విమర్శించారు. ఇంతేకాక రాష్ట్రంలో విద్య, శాంతి భద్రతలు, మహిళల భద్రతపై నిరాధారమైన ఆరోపణలు చేసి భయాందోళనల్ని సృష్టిస్తారని ఆరోపించారు.
Next Story






