- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నడ మాట్లాడనంటూ బ్యాంకు మేనేజర్ రచ్చ..స్పందించిన సీఎం
కర్నాటకలో ఎస్బీఐ మేనేజర్ కస్టమర్‌తో మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో తాను కన్నడ మాట్లాడను అంటూ ఆ మేనేజర్ రచ్చ చేయడంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: కర్నాటకలో ఎస్బీఐ మేనేజర్ కస్టమర్‌తో మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో తాను కన్నడ మాట్లాడను అంటూ ఆ మేనేజర్ రచ్చ చేయడంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన అనేకల్ తాలూకాలోని సూర్యనగర్ ఎస్బీఐ బ్రాంచులో చోటు చేసుకుంది. బ్యాంకుకు వచ్చిన కస్టమర్ కన్నడ మాట్లాడాలని కోరగా కన్నడలో మాట్లాడాలని ఏమైనా రూల్ ఉందా నేను కన్నడలో మాట్లాడను హిందీలో మాట్లాడను అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయింది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఆ ఉద్యోగిని ఎస్బీఐ సస్పెండ్ చేసింది. ఇక తాజాగా కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బ్యాంకు మేనేజర్ పౌరులతో ప్రవర్తించిన తీరు సరికాదని అన్నారు. స్థానిక భాషను బ్యాంకు ఉద్యోగులు అంతా గౌరవించాలని కస్టమర్లను గౌరవిస్తూనే స్థానిక భాషలో మాట్లాడే ప్రయత్నం చేయాలని అన్నారు. సూర్యనగర్ లో కన్నడ మాట్లాడేందుకు నిరాకరించిన మేనేజర్ ను సస్పెండ్ చేశారని చెప్పారు. ఇంతటితో ఈ సమస్య సద్దుమణిగిందని తాము భావిస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చూసుకోవాలన్నారు. భాషా వివాదం కొనసాగుతున్న వేళ ఇలాంటివి జరిగితే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందన్నారు.






