తొక్కిసలాటకు కారణం అదే.. CM సిద్ధరామయ్య అధికారిక ప్రకటన

by Gantepaka Srikanth |

చిన్నస్వామి స్టేడియంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది మృతిచెందినట్లు తెలిపారు.

తొక్కిసలాటకు కారణం అదే.. CM సిద్ధరామయ్య అధికారిక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్నస్వామి స్టేడియంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది మృతిచెందినట్లు తెలిపారు. 33 మంది పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు చెప్పారు. మరికొంతమందికి కూడా గాయాలు అయ్యాయని అన్నారు. ఊహించని రీతిలో అభిమానులు మైదానానికి రావడంతో తొక్కిసలాట జరిగిందని అన్నారు. స్టేడియం కెపాసిటీ 35 వేలు అయితే.. దాదాపు 3 లక్షల మంది మైదానానికి వచ్చినట్లు పోలీసులు అంచనా వేశారని తెలిపారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ప్రభుత్వమే చికిత్స అందిస్తుందని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని.. 15 రోజుల్లో నివేదిక వస్తుందని.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కాగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టు ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్టేడియం వద్దకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా దూసుకెళ్లారు. దీంతో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

Next Story