- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్సీబీ ఈవెంట్‌కు గవర్నర్‌ను నేనే పిలిచా.. సీఎం సిద్ధరామయ్య యూటర్న్
ఆర్సీబీ ఈవెంట్‌కు గవర్నర్‌ను తనే పిలిచినట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. గతంలో ఈ కార్యక్రమంతో తనకు సంబంధంలేదన్న ఆయన యూటర్న్ తీసుకున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్సీబీ తొక్కిసలాట ఘటనలో కర్ణాటక గవర్నర్ పాల్గొనడంపై సీఎం సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ ఘటనతో తనకు సంబంధం లేదని, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ఆహ్వానం మేరకే తను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని సీఎం చెప్పారు. అంతేకాకుండా గవర్నర్‌ను కూడా వాళ్లే ఆహ్వానించారని, అంతకుమించి తనకేం తెలియదని అన్నారు. అయితే ఇప్పుడు సడెన్‌గా యూటర్న్ తీసుకున్న సిద్ధరామయ్య.. గవర్నర్‌ను తనే స్వయంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు ఒప్పుకున్నారు.
‘జూన్ 4న ఉదయం 11.29 గంటలకు కేఎస్‌సీఏ, ఆర్సీబీ కార్యక్రమం జరుగుతోందని చెప్పి నన్ను ఆహ్వానించారు. చీఫ్ సెక్రటరీ కూడా అభ్యర్థించడంతో నేను వెళ్లాను’ అని చెప్పారు. అలాగే ఇటీవల సస్పెండ్ అయిన తన పర్సనల్ సెక్రటరీ గోవిందరాజు స్వయంగా గవర్నర్ ఆఫీసుకు ఫోన్ చేశాడని, ఆ కాల్ తనే మాట్లాడి గవర్నర్‌ను కూడా ఆర్సీబీ ఈవెంట్‌కు రావల్సిందిగా ఆహ్వానించానని సిద్ధరామయ్య ఒప్పుకున్నారు. తనంతట తానే ఈ కార్యక్రమానికి వచ్చినట్లు మీడియా కథనాలు వస్తున్న నేపథ్యంలోనే తను ఈ స్పష్టతనిస్తున్నట్లు పేర్కొన్నారు.






