హిందీ వివాదం... సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

దేశంలో హిందీ వివాదం వేళ క‌ర్నాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందీ, ఇంగ్లీష్ భాష‌లు ద‌క్షిణాది రాష్ట్రాల్లో పిల్ల‌ల నైపుణ్యాల‌ను బ‌ల‌హీన‌ప‌రుస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. విద్యాసంస్థ‌ల్లో మాతృభాష‌ను ప్రోత్స‌హించేలా కేంద్రం చ‌ట్టం తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు.

హిందీ వివాదం... సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెడ్ డెస్క్: దేశంలో హిందీ వివాదం వేళ క‌ర్నాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందీ, ఇంగ్లీష్ భాష‌లు ద‌క్షిణాది రాష్ట్రాల్లో పిల్ల‌ల నైపుణ్యాల‌ను బ‌ల‌హీన‌ప‌రుస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. విద్యాసంస్థ‌ల్లో మాతృభాష‌ను ప్రోత్స‌హించేలా కేంద్రం చ‌ట్టం తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. కేంద్రం క‌ర్ణాట‌క‌పై స‌వ‌తి త‌ల్లి వైఖ‌రి ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని, హిందీని బ‌ల‌వంతంగా రుద్దుతోంద‌ని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లోని పిల్ల‌లు మాతృభాష‌లోనే నేర్చుకుంటార‌ని కానీ మ‌న దేశంలో ప‌రిస్థితి దానికి విరుద్ధంగా ఉందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇంగ్లీష్, హిందీ మ‌న పిల్ల‌ల ప్ర‌తిభ‌ను బ‌ల‌హీన‌ప‌రుస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. ఈ స‌మ‌స్య నివారించాలంటే మాతృభాష‌ను బోధ‌నా మాధ్య‌మంగా ప్ర‌వేశ‌పెడుతూ చ‌ట్టం తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. క‌న్న‌డ దాని సంస్కృతిని కొత్త శిఖ‌రాల‌కు తీసుకుని వెళ్లాల్సిన అవ‌సరం ఉంద‌న్నారు. క‌న్న‌డ భాష‌పై జ‌రుగుతున్న నిర్లక్ష్యం రాష్ట్రంలో అనేక స‌మ‌స్య‌ల‌కు కారనణం అయ్యింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హిందీ అభివృద్ధికి గ్రాంట్లు విడుద‌ల చేస్తున్న కేంద్రం ఇత‌ర భాష‌ల అభివృద్ధికి గ్రాంట్లు విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపించారు. క‌న్న‌డ‌ను వ్య‌తిరేఖించేవారిని రాష్ట్ర‌ప్ర‌జ‌లు వ్య‌తిరేఖించాల‌ని వ్యాఖ్యానించారు.

Next Story