- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు గ్రాంట్ మంజూరు చేసిన సీఎం సిద్దరామయ్య
సీఎం సిద్దరామయ్య ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు గ్రాంట్ మంజూరు చేశారు. ఈ డబ్బుతో నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని ప్రతి ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల నిధులు అందించేందుకు సీఎం సిద్ధరామయ్య అంగీకరించారు. పార్టీలో అంతర్గత చర్చల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు లేవని ఫిర్యాదులు చేసినట్లు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రాష్ట్ర ఇంచార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.
ఎమ్మెల్యేలంతా నిధులు లేకపోవడంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సూర్జేవాలా తెలియజేశారు. అంతర్గతంగా పలు సమావేశాలు నిర్వహించిన అనంతరం.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల గ్రాంట్ మంజూరు చేయాలని సీఎం నిర్ణయించారు.
కాగా, కొన్నిరోజులుగా తమ తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు లేవని పలువురు కర్ణాటక ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం తమకు నిధులు ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరికలు చేశారు. ఈ క్రమంలో తాజాగా సీఎం సిద్దరామయ్య తీసుకున్న నిర్ణయం వారందరికీ ఊరటనిచ్చిందనే చెప్పాలి.






