'పవర్ బ్రేక్‌ఫాస్ట్' రాజకీయం.. సీఎం, డిప్యూటీ సీఎంల భేటీతో సమ్య ముగిసేనా..?

by Malleboina Mahesh |

కర్ణాటక సీఎం పోస్ట్ మార్పు పై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

పవర్ బ్రేక్‌ఫాస్ట్ రాజకీయం.. సీఎం, డిప్యూటీ సీఎంల భేటీతో సమ్య ముగిసేనా..?
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం పోస్ట్ మార్పు పై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఒప్పందం మేరకు డీకే శివకుమార్ కు సీఎం పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద పట్టుబట్టారు. దీంతో రంగంలోకి కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. కాగా ఈ పరిణామాలు కర్ణాటక కాంగ్రెస్ ను కుదిపేయడంతో.. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ పాస్ట్ మీటింగ్ లు చేపడుతున్నారు. మొదట సిద్ధరామయ్య ఇంటికి డీకే బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కి వెళ్లగా.. తాజాగా.. బెంగళూరులోని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు.

ఇది ఇరు వర్గాల మధ్య సఖ్యత, ఐక్యతను స్పష్టం చేసింది. ఈ సమావేశం అనంతరం, ఇద్దరు నాయకులు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సంయుక్తంగా ప్రకటించారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయడంపై ఈ చర్చల్లో దృష్టి సారించినట్లు తెలిపారు. సీఎం పదవి పంపకంపై నెలకొన్న ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలకు తాత్కాలికంగా తెరదించడానికి ఈ 'బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు' దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story