Bengaluru Stampede : తొక్కిసలాట ఘటన.. ఈసారి సీఎం సెక్రెటరీపై వేటు

by Muthe.Rajitha |

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న భారీ తొక్కిసలాట(Bengaluru Stampede) జరిగిన సంగతి తెలిసిందే.

Bengaluru Stampede : తొక్కిసలాట ఘటన.. ఈసారి సీఎం సెక్రెటరీపై వేటు
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న భారీ తొక్కిసలాట(Bengaluru Stampede) జరిగిన సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవ ర్యాలీ(Victory Parade) సందర్భంగా జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద ఇప్పటికే నగర కమిషనర్ తోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది కర్ణాటక ప్రభుత్వం. తాజాగా సీఎం పొలిటికల్ సెక్రెటరీపై కూడా వేటు పడింది. సీఎం సిద్ధరామయ్య(CM Siddha Ramaiah) రాజకీయ కార్యదర్శి కె. గోవిందరాజును(CM Politicle Secretary K.Govindaraju) నేడు సస్పెండ్ చేశారు.

విక్టరీ పరేడ్ నిర్వహించవద్దని తాను సీఎంకు సలహా ఇచ్చినా వినలేదని గోవిందరాజు మాట్లాడినట్టు సమాచారం. దీనిపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై సస్పెన్షన్ విధించారు. అయితే, గోవిందరాజు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తనను తప్పుగా అర్థం చేసుకున్నారని వాదిస్తున్నారు. కాగా ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story