CM Revanth Reddy : లిక్కర్ స్కాంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ ఎన్నికల(Delhi Election)పై మీడియా సమావేశం నిర్వహించారు.

CM Revanth Reddy : లిక్కర్ స్కాంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ ఎన్నికల(Delhi Election)పై మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేంద్రయాదవ్(PCC Cheif Devendra Yadav) తో కలిసి ఎన్నికల హామీల పోస్టర్(Election Guarantee Poster) ను విడుదల చేశారు. రెండు ఎన్నికల హామీలను ఈ సందర్భంగా ప్రకటించారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్ తోపాటు, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందిస్తామని హామీబ్ ఇచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాదిలోపే కాంగ్రెస్ ఆరు గ్యారంటీల(Congress Six Guarantees)ను నెరవేర్చామని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. అదే విధంగా పాలనలోకి వచ్చిన ఏడాదిలోపే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు.

దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది అన్నారు. మోడీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాల హామీ ఇచ్చింది.. కాని నెరవేర్చలేదన్నారు. లిక్కర్ స్కాంలో పార్టనర్ ను తెలంగాణలో ఓడించానని, అసలు పార్టనర్ ను ఢిల్లీలో ఓడిస్తామని స్పష్టం చేశారు. వేరే రాష్ట్రాల నుంచి ప్రజలు ఢిల్లీకి రావాలంటే ఇక్కడి కాలుష్యానికి భయపడుతున్నారని.. కాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ ఉన్నపుడు ఇంత సమస్య లేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కావున ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ కు ఓటు వేయాలని ఢిల్లీ ప్రజలను కోరారు.

Next Story