ఆర్మీ అధికారులతో సీఎం రేవంత్ సమావేశం.. రాష్ట్రానికి సైనిక స్కూల్ ఇవ్వాలని విజ్ఞప్తి

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది.

ఆర్మీ అధికారులతో సీఎం రేవంత్ సమావేశం.. రాష్ట్రానికి సైనిక స్కూల్ ఇవ్వాలని విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా ఆర్మీ, ప్రభుత్వం మధ్య భూ సమస్యలు, ఇతర పాలనాపరమైన అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ - ఆంధ్రా సబ్ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ - ఆర్మీ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం.. ఆర్మీ ఉన్నత అధికారులకు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రంలో సైనిక స్కూలును ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటివరకూ తెలంగాణకు ఒక్క సైనిక స్కూలును కూడా మంజూరు చేయలేదని గుర్తుచేశారు. అలాగే సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ కు మార్చే విషయాన్ని కూడా పరిశీలించాలని కోరారు. రాష్ట్రానికి - ఆర్మీకి మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ లో లో-ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్కు 3 వేల ఎకరాలను కేటాయించినట్లు చెప్పారు.

Next Story