- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ దూకుడు.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా సీఎం రేవంత్ రెడ్డి
కేరళలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏఐసీసీ (AICC), ఆయా రాష్ట్రాల కోసం 40 మందితో కూడిన భారీ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమిని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా నియమించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో రేవంత్ రెడ్డి అనుసరించిన దూకుడు వ్యూహాలు, ప్రసంగ శైలి కేరళలో కూడా పార్టీకి మైలేజ్ ఇస్తాయని అధిష్టానం భావిస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రచార బరిలో నిలవనున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు హేమాహేమీలు..
కేరళ, పుదుచ్చేరి, అస్సాం సహా ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను రంగంలోకి దించుతోంది. ఈ ఎన్నికల కోసం నియమించిన ప్రధాన స్టార్ క్యాంపెయినర్లుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే (ఏఐసీసీ అధ్యక్షుడు), కేసీ వేణుగోపాల్, సిద్ధరామయ్య (కర్ణాటక సీఎం), డీకే శివకుమార్ (కర్ణాటక డిప్యూటీ సీఎం), రేవంత్ రెడ్డి (తెలంగాణ సీఎం), భట్టి విక్రమార్క (తెలంగాణ డిప్యూటీ సీఎం)లకు బాధ్యతలు అప్పగించింది. కేరళలో ఇప్పటికే రాహుల్ గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో, అక్కడి గెలుపు పార్టీకి అత్యంత కీలకంగా మారింది. రేవంత్ రెడ్డి త్వరలోనే కేరళ పర్యటనకు వెళ్లి అక్కడి ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు.






