నీతి ఆయోగ్ సమావేశానికి ఢిల్లీ చేరిన సీఎం రేవంత్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-11 03:58:20  IST  )

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్ర‌ధాని మెడీ అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ 11వ పాల‌క మండ‌లి స‌మావేశంలో ఆయ‌న పాల్గొన‌నున్నారు. ఉద‌యం 9.30 గంట‌ల‌కు ఈ స‌మావేశం ప్రారంభం కానుంది.

నీతి ఆయోగ్ సమావేశానికి ఢిల్లీ చేరిన సీఎం రేవంత్
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్ర‌ధాని మెడీ అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న నీతి ఆయోగ్ 11వ పాల‌క మండ‌లి స‌మావేశంలో ఆయ‌న పాల్గొన‌నున్నారు. ఉద‌యం 9.30 గంట‌ల‌కు ఈ స‌మావేశం ప్రారంభం కానుంది. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, అభివృద్ధి ప్రణాళిక‌ల‌పై సీఎం చ‌ర్చిస్తారు. ఈ స‌మావేశానికి ఏపీ సీఎం చంద్ర‌బాబు సైతం హాజ‌రుకానున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో పాటు కేంద్ర‌పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్లు, నిర్వాహ‌కులు, ఉన్న‌తాధికారులు హ‌జ‌ర‌వుతున్నారు.

భారతదేశాన్ని 2047 నాటికి సర్వతోముఖాభివృద్ధి చెందిన దేశంగా మార్చ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స‌మావేశం జ‌రుగుతోంది. సమావేశానికి వికసిత భారత్ @2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి థీమ్ ఎంచుకున్నారు. దేశ ప్ర‌గ‌తిని వేగ‌వంతం చేసేందుకు స‌మావేశంలో నాలుగు ప్ర‌ధాన‌మైన అంశాల‌పై దృష్టి పెట్టారు. భ‌విష్య‌త్ కాలానికి అనుగుణంగా యువ‌త‌లో నైపుణ్యాల‌ను పెంచ‌డం, దేశ ప్ర‌జ‌ల ఆరోగ్యం పోష‌కాహారం సంక్షేమంపై శ్ర‌ద్ధ పెట్ట‌డం, స‌మాజంలో అంద‌రికీ స‌మాన‌త్వం గౌర‌వాన్ని అందించ‌డం, స్థానిక ఉపాధి వ్య‌వ‌స్థాప‌క‌త ఆధారిత వికేంద్రీకృత అభివృద్ధిని ప్రోత్స‌హించ‌డం లాంటి అంశాల‌ను నాలుగు స్థంభాలుగా పేర్కొన్నారు. వీటితో పాటు స్కూల్ ఎడ్యుకేష‌న్, క్రీడ‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు.

Next Story