జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రజలను కేంద్రం మోసం చేసింది: సీఎం ఒమర్ అబ్దుల్లా

by Phanindra |

జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రజలను కేంద్రం మోసం చేసిందని సీఎం ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఈ ప్రాంతాలకు రాష్ట్రహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రజలను కేంద్రం మోసం చేసింది: సీఎం ఒమర్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్, లద్దాఖ్ రాష్ట్రహోదా గురించి జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంత ప్రజలను తమ విధానాల్లో కేంద్రంగా ఉంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలను సెంట్రల్ గవర్నమెంట్ మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రాంతాలకు రాష్ట్రహోదా ఇస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోవడం లేదని, దీంతో ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచుతోందని అభిప్రాయపడ్డారు.

‘మీరు ప్రజలను కావాలనుకున్నప్పుడు.. వారిని దగ్గరకు తీసుకోవాలి కదా. అప్పుడు ఇది నేలకు సంబంధించిన సమస్య అవ్వదు. ప్రజల సమస్యే. ఇది కశ్మీర్ సమస్య కాదు.. కశ్మీరీల సమస్య. ఈ చిన్న ఆలోచన చేస్తే ఎంతో మార్పు వస్తుంది’ అని సీఎం అన్నారు. ఇటీవల లేహ్‌లో అల్లర్ల కేసులో యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ అరెస్టయిన నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Next Story