- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోర్టు తీర్పుపై బెంగాల్ CM మమతా బెనర్జీ అసంతృప్తి.. బలవంతంగా కేసును తమనుంచి లాక్కున్నారని ఆవేదన
కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచారం కేసు(Kolkata Trainee Doctor Murder Case)లో సీల్దా కోర్టు(Sealdah Court) దోషి సంజయ్ రాయ్(Sanjay Roy)కి జీవితఖైదు విధించింది.

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచారం కేసు(Kolkata Trainee Doctor Murder Case)లో సీల్దా కోర్టు(Sealdah Court) దోషి సంజయ్ రాయ్(Sanjay Roy)కి జీవితఖైదు విధించింది. తాజాగా.. ఈ తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(West Bengal CM Mamata Banerjee) అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరం నిందితుడికి ఉరిశిక్ష పడుతుందని భావించామని తెలిపారు. కానీ కోర్టు జీవిత ఖైదు విధించిందని అన్నారు. ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి బలవంతంగా సీబీఐ(CBI)కి బదిలీ చేశారని వెల్లడించారు. ఒకవేళ కోల్‌కతా పోలీసుల(Kolkata Police) చేతుల్లోనే ఉంటే వారు దోషికి మరణశిక్ష పడేలా వందశాతం ప్రయత్నించే వారని అన్నారు.
ఇదిలా ఉండగా.. సీల్దా కోర్టు తీర్పుపై కోల్‌కతా విద్యార్థులు(Kolkata Students) సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగ సీల్దా కోర్టు ఎదుట విద్యార్థుల నిరసన వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరి శిక్ష విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని స్టూడెంట్స్ సంచలన ప్రకటన చేశారు. కాగా, కోర్టు తీర్పులో దోషికి జీవితఖైదు విధించడంతో పాటు బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు.






