- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైలుకు వెళ్లే ముందు దేశ రాజకీయాల్లో మరో బిగ్ బాంబ్ పేల్చిన CM కేజ్రీవాల్
దేశంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగియండంతో పలు నేషనల్ మీడియా ఛానెల్స్, ప్రైవేట్ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పలు నేషనల్ మీడియా ఛానెల్స్, ప్రైవేట్ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఓటర్ల నాడీ పసిగట్టి దేశంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే విషయాన్ని అంచనా వేశాయి. ఈ క్రమంలోనే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమినే మరోసారి విజయఢంకా మోగించబోతుందని తేల్చాయి. బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి ఎర్రకోటపై కాషాయ జెండా రెపరెపలాడించబోతుందని స్పష్టం చేశాయి. ప్రతిపక్ష ఇండియా కూటమికి ఈ సారి కూడా నిరాశ తప్పదని.. కూటమి 200 సీట్లలోపే చాప చుట్టేసి మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లుకు చాలా దూరంలో ఉంటుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ ముగియడంతో తిరిగి జైలులో సరెండర్ అయ్యేముందు కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్ని ఫేక్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 పార్లమెంట్ స్థానాలు ఉన్న రాజస్థాన్‌లో బీజేపీ 33 సీట్లు గెలుస్తోందని ఓ సర్వే సంస్థ చెప్పిందని.. అసలు ఇది ఎలా సాధ్యమని ఎద్దేవా చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అనడానికి ఈ ఘటనే బెస్ట్ ఎగ్జామ్‌పుల్ అని చమత్కరించారు. ఫలితాల విడుదలకు మూడు రోజుల ముందే తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు పూర్తి భిన్నంగా కౌంటింగ్ రోజున రిజల్ట్స్ వస్తాయని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
కొందరు ఈవీఎంలను మార్చడానికి ట్రై చేస్తున్నారని జైలుకు వెళ్లేముందు కేజ్రీవాల్ మరో బిగ్ బాంబ్ పేల్చారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న కేజ్రీవాల్.. ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేయడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 22 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై జైలు నుండి బయటికి వచ్చిన కేజ్రీవాల్ ప్రచారంలో తనదైన శైలీలో దూసుకుపోయారు. అధికార ఎన్డీఏ కూటమిని కొత్త కొత్త అంశాలతో టార్గెట్ చేసి ఇరుకునపెట్టారు. లోక్ సభ ఎన్నికల క్యాంపెయినింగ్‌లో స్టార్టింగ్ నుండి వన్ సైడ్‌గా దూసుకుపోయినా బీజేపీకి కేజ్రీవాల్ వచ్చి బ్రేకులు వేశారు. కేజ్రీవాల్ ఎంట్రీతో ఇండియా కూటమి ప్రచారంలో మరింత జోష్ వచ్చింది.






