- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఠాక్రే సోదరుల పొత్తుపై మహారాష్ట్ర సీఎం దేవందర్ ఫడ్నవీస్ షాకింగ్ కామెంట్స్
ముంబై రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. 20ఏళ్ల క్రితం విడిపోయిన ఠాక్రే సోదరులు ఓట్ల కోసం చేతులు కలిపారు. రాబోయే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో శివసేన (UBT), MNS పొత్తు చేయనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ముంబై రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. 20ఏళ్ల క్రితం విడిపోయిన ఠాక్రే సోదరులు ఓట్ల కోసం చేతులు కలిపారు. రాబోయే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో శివసేన (UBT), MNS పొత్తు చేయనున్నాయి. జనవరి 15న BMC ఎన్నికల బరిలోకి ఉమ్మడిగా శివసేన (UBT), MNS పార్టీలు దిగనున్నాయి. అయితే ఈ పొత్తుపై మహారష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చలు జరుగుతున్న రేంజ్ లో వారి కలయికను చూపుతున్నారని ఎద్దేవా చేశారు. జెలన్ స్కీ, పుతిన్ మాట్లాడుకున్నట్టు హైప్ ఇస్తున్నారని అన్నారు.
తమ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకే రెండు పార్టీలు కలుస్తున్నాయని అన్నారు. శివసేన (UBT), మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన (MNS) కలయిక వల్ల ప్రజలకు ప్రయోజనం లేదని విమర్శించారు. సిద్ధాంతాలు పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే ఠాక్రే సోదరులు కలిశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి గెలవలేవని తేలిపోయిందని అందుకే పొత్తు పెట్టుకున్నారి విమర్శించారు. ముంబై ప్రజలు తమ ప్రభుత్వం పనితీరును గమనించారని అన్నారు. ముంబై ప్రజలు ఇప్పటి వరకు తమవెంటే ఉన్నారని ఇకపై కూడా ఉంటారని దీమా వ్యక్తం చేశారు.






