డెహ్రాడూన్‌లో క్లౌడ్‌బరెస్ట్.. ఉగ్రరూపం దాల్చిన తామ్సా నది

by Malleboina Mahesh |

సోమవారం అర్ధరాత్రి ఎవరూ ఊహించిన విధంగా ఉత్తరాఖాండ్ లోని డెహ్రాడూన్‌ సమీపంలోని సాహస్రధారా క్లౌడ్‌ బరెస్ట్ కారణంగా కుండపోత వర్షాలు కురిషాయి.

డెహ్రాడూన్‌లో క్లౌడ్‌బరెస్ట్.. ఉగ్రరూపం దాల్చిన తామ్సా నది
X

దిశ, వెబ్ డెస్క్: సోమవారం అర్ధరాత్రి ఎవరూ ఊహించిన విధంగా ఉత్తరాఖాండ్ లోని డెహ్రాడూన్‌ సమీపంలోని సాహస్రధారా క్లౌడ్‌ బరెస్ట్ (Cloud burst) కారణంగా కుండపోత వర్షాలు కురిషాయి. దీంతో తామ్సా నది ఉప్పొంగి ప్రవహించింది. అర్ధరాత్రి ఊహించని విధంగా ఆకస్మిక వరదలు చోటు చేసుకోవడంతో ప్రసిద్ధ టపకేశ్వర్ మహాదేవ్ ఆలయం (Tapakeshwar Mahadev Temple) పూర్తిగా నీట మునిగి పోయింది. ఆలయ గర్భగృహంలో ఉన్న శివలింగం మాత్రం సురక్షితంగానే ఉందని ఆలయ పురోహితులు తెలిపారు. వర్షాల తీవ్రతతో రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. కొన్ని హోటళ్లకు నష్టం వాటిల్లింది. స్థానిక ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు రెస్క్యూ టీములు (SDRF, NDRF) తక్షణమే చర్యలు చేపట్టాయి.

మరోవైపు, భారత వాతావరణ శాఖ (IMD) ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, తీహ్రి గఢ్వాల్ సహా పలు జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా కొందరు కనిపించకుండా పోయారనే సమాచారం వెలువడగా, ఇంకా పూర్తి వివరాలు అధికారుల నుంచి రావాల్సి ఉంది. ఈ సంఘటనతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. నదీ పరిధిలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే రిషికేశ్‌లోని చంద్రభాగ నది (Chandrabhaga River) ఈ ఉదయం నుండి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీనివల్ల నీరు హైవే పైకి చేరుకుంది. నదిలో చిక్కుకున్న ముగ్గురిని ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం రక్షించింది. అయితే అనేక వాహనాలు నీటిలో చిక్కుకొని పోయాయి. ప్రస్తుతం వరద ప్రవాహం అధికంగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్లకు ఆటంకం కలుగుతోంది.

ఇదిలా ఉంటే రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి (CM Pushkar Singh Dami) ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో "నిన్న అర్థరాత్రి డెహ్రాడూన్‌లోని సహస్త్రధారలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొన్ని దుకాణాలు దెబ్బతిన్నాయి. జిల్లా యంత్రాంగం, ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ, సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ విషయంలో నేను స్థానిక పరిపాలనతో నిరంతరం సంప్రదిస్తూ.. పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాను" అని సీఎం పుష్కర్ సింగ్ ధామి తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

Next Story