కోట్లు ఖర్చు చేసినా కురవని వర్షం.. ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ అట్టర్ ఫ్లాప్

by Ajay Maddhiboyina |

ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం కృత్రిమ వ‌ర్షాలు కురిసేలా ప్ర‌భుత్వం క్లౌడ్ సీడింగ్ ప్ర‌క్రియ మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. కాలుష్యాన్ని త‌గ్గించేందుకు మేఘాల‌ను కృత్రిమంగా చ‌ల్ల‌బ‌రిస్తే వ‌ర్షాలు కురుస్తాయ‌ని ప్రభుత్వం భావించింది. అయితే ఆశించిన ఫ‌లితం లేక‌పోవ‌డంతో క్లౌడ్ సీడింగ్‌ను నిలిపివేసింది.

కోట్లు ఖర్చు చేసినా కురవని వర్షం.. ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ అట్టర్ ఫ్లాప్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం కృత్రిమ వ‌ర్షాలు కురిసేలా ప్ర‌భుత్వం క్లౌడ్ సీడింగ్ ప్ర‌క్రియ మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. కాలుష్యాన్ని త‌గ్గించేందుకు మేఘాల‌ను కృత్రిమంగా చ‌ల్ల‌బ‌రిస్తే వ‌ర్షాలు కురుస్తాయ‌ని ప్రభుత్వం భావించింది. అయితే ఆశించిన ఫ‌లితం లేక‌పోవ‌డంతో క్లౌడ్ సీడింగ్‌ను నిలిపివేసింది. ఈ నెల 28న ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్ సహకారంతో మేఘాలపై వాటిని చల్లబరిచే రసాయనాలను విమానాల ద్వారా చల్లించింది.

కానీ మేఘాల్లో తగినంత తేమ లేకపోవడంతో వర్షం కురవలేదని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ప్రక్రియ కోసం రూ.3.21 కోట్లు ఖర్చు చేయగా డబ్బు వృధా అయింది. దీనిపై ఐఐటీ కాన్పూర్ డైరెక్ట‌ర్ మ‌నీంద్ర అగ‌ర్వాల్ మాట్లాడుతూ.. క్లౌడ్ సీడింగ్ వ‌ల్ల వ‌ర్షాలు కుర‌వ‌లేదు కానీ భ‌విష్య‌త్ ప్ర‌య‌త్నాల కోసం ముఖ్య‌మైన స‌మాచారం ల‌భించింద‌న్నారు. ఇదిలా ఉంటే క్లౌడ్ సీడింగ్‌తో కృత్రిమ వ‌ర్షాలు కురుస్తాయ‌ని కాలుష్యం నుండి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ని ప్ర‌జ‌లు భావించారు. కానీ కానీ ఊహించిన‌ట్టు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో నిరాశ చెందుతున్నారు.

Next Story