- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి క్లౌడ్ బరస్ట్.. పలువురు గల్లంతు
ఉత్తరాఖండ్ (Uttarakhand)లో మరోసారి క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) బీభత్సం సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్ (Uttarakhand)లో మరోసారి క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) బీభత్సం సృష్టించింది. శుక్రవారం చమోలీ జిల్లాలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలువురు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. వర్షంతో కొండిచరియలు విరిగిపడి ఇళ్లపై పడిపోయాయి. ఇక తరాలీ మార్కెట్ ప్రాంతంతో పాటు తరాలీ తహసీల్ కాంప్లెక్స్ శిథిలాల్లో కూరుకుపోయాయి సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) అధికారిక నివాసం, దుకాణాలు, వాహనాలతో సహా అనేక గృహ ప్రాంతాలు దెబ్బతిన్నాయి. సాగ్వారా గ్రామంలో ఒక భవనం లోపల శిథిలాల కింద చిక్కుకున్న బాలికను స్థానికులు చాకచక్యంగా బయటకు తీసుకొచ్చారు. అదేవిధంగా చెప్డాన్ మార్కెట్ ప్రాంతంలో కొన్ని దుకాణాలు దెబ్బతిన్నాయి.
తరాలీ-గ్వాల్దం రహదారితో పాటు తరాలీ-సాగ్వారా రోడ్డుపై బండరాళ్లు విరిగిపడటంతో అధికారుల ఆ రహదారులను మూసివేశారు. NDRF, SDRF బృందాలు గత రాత్రి నుంచి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్లౌడ్ బరస్ట్‌లో గల్లంతైన వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ (CM Pushkar Singh Dhami) కీలక వ్యాఖ్యలు చేశారు. గత రాత్రి తరాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వర్షం కారణంగా ప్రజా జీవనం ఆటంకం కలిగిందని అన్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, తరాలీ పోలీసులు రాత్రి సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి స్థానిక ప్రజలను హెచ్చరించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని తెలిపారు. గత రాత్రి చమోలీ జిల్లాలోని తరాలీ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్‌పై తనకు నివేదిక అందిందని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగంతో పాటు SDRF, పోలీసులు ఘటనా స్థలంలో సహాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారని సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు.






