- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూకశ్మీర్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. పదిమంది పైగా మృతి
by Naga Rani Yarlagadda |
జమ్మూకశ్మీర్లో మరోసారి మేఘం కన్నెర్రజేసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన భారీ వర్షానికి పదిమందికి పైగా మృతి చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్లో మరోసారి మేఘం కన్నెర్రజేసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురిసిన భారీ వర్షానికి పదిమందికి పైగా మృతి చెందారు. రాంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గల్లంతవ్వగా వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. రియాసి జిల్లా మహోర్ లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఓ ఇంటిపై కొండచరియలు విరిగి పడటం వల్లే ఇలా జరిగినట్లు అధికారులు తెలిపారు.
వరదల కారణంగా ఈ ప్రాంతంలోని ఇళ్లు కొట్టుకుపోగా.. పలు ఇళ్లు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో పూంఛ్, కిశ్త్ వాడ్, జమ్మూ, రాంబాన్, ఉధంపూర్ లలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Next Story






