- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. 12 మంది మృతి
జమ్మూకశ్మీర్‌లో మరోసారి వరదలు భీబత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు కిష్టావర్ జిల్లాలోని చిషోటి గ్రామంలో 12 నుండి 15 మంది మరణించినట్టు సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లో మరోసారి వరదలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు కిష్టావర్ జిల్లాలోని చిషోటి గ్రామంలో 12 నుండి 15 మంది మరణించినట్టు సమాచారం. మచైల్ మాతా యాత్ర ప్రారంభం అయ్యే ప్రాంతంలోనే వరదలు పొటెత్తినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృంధాలను ఆదేశించారు. ప్రమాదం గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నానని, గాయపడ్డవారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఉత్తరాఖండ్‌లోనూ భారీగా వరదలు పోటెత్తిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో ఓ గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది.
Next Story






