జమ్మూకశ్మీర్లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. ఏడుగురు మృతి

by Naga Rani Yarlagadda |

జమ్మూకశ్మీర్లో మరోసారి మేఘం బద్దలైంది. కథువా జిల్లాలోని ఘాటీ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ అవ్వడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

జమ్మూకశ్మీర్లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. ఏడుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్లో మరోసారి మేఘం బద్దలైంది. కథువా జిల్లాలోని ఘాటీ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ అవ్వడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక పోలీస్ అధికారి తెలిపిన దానిప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ క్లౌడ్ బరస్ట్ జరిగింది. సహాయక చర్యల నిమిత్తం ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద ఒక కుటుంబం చిక్కుకున్నట్లు సమాచారం. భారీవర్షాల కారణంగా సహాక్ ఖాద్, ఉజ్ నదుల్లో వరదనీరు అమాతం పెరగ్గా.. రైలు పట్టాలు, జాతీయ రహదారి సహా.. ప్రధాన మార్గాలపై వాహనాలు నిలిచిపోయాయి. కథువా పోలీస్ స్టేషన్లోకి కూడా వరదనీరు చేరినట్లు తెలిపారు.

ఆ ప్రాంతంల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ప్రజలు ఆ ప్రాంతాల నుంచి దూరంగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరారు. కాగా.. ఇటీవల కిశ్త్ వాడ్ జిల్లాలోనూ క్లౌడ్ బరస్ట్ జరగ్గా 46 మంది మరణించారు.

Next Story