- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్...భారీగా వరదలు భయాందోళనలో ప్రజలు
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి.భారీగా వరదలు రావడంతో రాష్ట్రంలోని కులు జిల్లాలో రహదారులు, వాహనాలు కొట్టుకుపోయాయి. రహదారులు కొట్టుకుపోవడంతో ట్రాఫిక్‌లో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు కూడా చిక్కుకున్నారు. భారీ వరదల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని నదుల్లో మోతాదుకు మించి నీటి మట్టం పెరిగిపోయింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం సంభవించనప్పటికి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎన్డీఆర్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలో మరో 24 గంటల పాటు తేలికపాటి నుండి భారీ వర్షాలు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.






