ఢిల్లీ వ్యాప్తంగా మెట్రో స్టేషన్ల మూసివేత: సీజేఐ సూర్యకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-23 09:06:49  IST  )

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలతో ఢిల్లీలోని మెట్రో స్టేషన్లను మూసివేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీ వ్యాప్తంగా మెట్రో స్టేషన్ల మూసివేత: సీజేఐ సూర్యకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపడుతున్న నిరసనలతో నగరంపై తీవ్ర ప్రభావం పడుతోంది. తాజాగా భద్రతా కారణాల దృష్ట్యా జంతర్‌మంతర్, సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని పలు కీలక మెట్రో స్టేషన్ల ఎంట్రెన్స్, ఎగ్జీట్ గేట్లను మూసేశారు. దీంతో ప్రతిరోజూ ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అయితే, ఇదే అంశం ఇవాళ భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Suryakant) అభ్యర్థనకు వచ్చింది. సీజేఐ నిరసనల వల్ల మెట్రో స్టేషన్లు మూసివేయడం, ట్రాఫిక్ స్తంభించిపోవడంతో నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఓ న్యాయవాది సీజేఐకి విన్నవించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. పరిస్థితిని తాము గమనిస్తున్నామని అన్నారు. సాధారణ ప్రజల రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతుంటే, అవసరమైతే ఈ వ్యవహారంలో త్వరలోనే కోర్టు చేసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. సీజేఐ వ్యాఖ్యలతో ఈ నిరసనల నియంత్రణపై అత్యున్నత న్యాయస్థానం త్వరలోనే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story