Aviation Industry: 24 విమానాశ్రయాల మూసివేత పొడిగింపు

by S Gopi |

విమానాశ్రయాలు వచ్చే గురువారం ఉదయం 5.29 గంటల వరకు మూసేయనున్నారు.

Aviation Industry: 24 విమానాశ్రయాల మూసివేత పొడిగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని పశ్చిమ ప్రాంతాల్లోని సరిహద్దులకు సమీపంలో ఉన్న 24 విమానాశ్రయాల మూసివేతను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరో ఐదు రోజులు, అంటే మే 15 వరకు పొడిగించింది. పాకిస్తాన్‌తో యుద్ధ పరిస్థితులు పెరుగుతుండటంతో విమానాశ్రయాలు వచ్చే గురువారం ఉదయం 5.29 గంటల వరకు మూసేయనున్నారు. ఈ విమానాశ్రయాలకు సంబంధించి అనేక విమానాలు రద్దు చేశారు. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, చండీగఢ్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్‌లకు, అక్కడి నుంచి విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణీకులకు పూర్తి వాపసు లేదా వన్-టైమ్ రీషెడ్యూలింగ్ మినహాయింపును అందిస్తున్నామని స్పష్టం చేసింది. ఇండిగో ఇతర నగరాలకు విమాన కార్యకలాపాలను కూడా రద్దు చేసింది. వినియోగదారులు ఫలిట్ స్టేటస్‌ను తనిఖీ చేయడానికి, తిరిగి బుక్ చేసుకోవడానికి లేదా వాపసు కోసం దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌లను పంపించింది. గురువారం సాయంత్రం తర్వాత నుంచి శత్రు దేశం పాకిస్తాన్ జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి దాడులను చేస్తోంది.

Next Story