- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీధిలో టీచర్‌పై ఇంటర్ విద్యార్థి దాడి.. పెదవి కొరికి కిరాతకం.. వైరల్
ఒక విద్యార్థి తన టీచర్‌పై వీధిలో అందరూ చూస్తుండగానే దాడి చేసి, లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఒక విద్యార్థి తన టీచర్‌పై వీధిలో అందరూ చూస్తుండగానే దాడి చేసి, లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో కలకలం రేపింది. ఈ క్రమంలో నిందితుడు ఆమె పెదవిని బలంగా కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. టీచర్ తన ఇంటి నుంచి ట్యూషన్ క్లాసులకు వెళ్తున్న సమయంలో 12వ తరగతి విద్యార్థి ఆమెను మార్గమధ్యలో అడ్డుకున్నాడు. ఆమె భుజాలపై చేతులు వేస్తూ దాడి చేశాడు. వీధిలో అందరూ చూస్తుండగానే ఆ విద్యార్థి పైశాచికంగా ప్రవర్తించి, ఆమె పెదవిని కొరికేశాడు.
గతంలో కూడా పలుమార్లు..
మెయిన్‌పురి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. సదరు విద్యార్థి గతంలో కూడా పలుమార్లు ఆ ఉపాధ్యాయురాలిని వేధించినట్లు సమాచారం. ఈ విషయంపై గతంలోనే విద్యార్థి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని పోలీసులు పేర్కొన్నారు. అతను పదేపదే ఇబ్బందులకు గురి చేసే స్వభావం కలవాడని, ఉపాధ్యాయురాలిని లక్ష్యంగా చేసుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని ప్రాథమిక విచారణలో తేలింది.
సోషల్ మీడియాలో వైరల్..
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.






