- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎథనాల్ ప్లాంట్‌పై ఘర్షణ.. హనుమాన్‌గఢ్‌లో పోలీసులు, అధికారులపై దాడులు
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా, టిబ్బి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఎథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన రైతుల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా, టిబ్బి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఎథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన రైతుల నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్లాంట్ వల్ల భూగర్భ జలాల కాలుష్యం జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు మహా పంచాయత్ నిర్వహించారు. ఈ నిరసన అనంతరం రైతులు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి దూసుకెళ్లి, నిర్మాణంలో ఉన్న సరిహద్దు గోడను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించిన పోలీసులు, అధికారులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వి, పలు వాహనాలకు నిప్పు పెట్టి, ధ్వంసం చేశారు. ఈ ఘర్షణల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు.
ఉద్రిక్తత మరింత పెరగడంతో పోలీసులు లాఠీఛార్జి మరియు కన్నీటి వాయుగోళాలను ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ హింస నేపథ్యంలో, అధికారులు అదనపు బలగాలను మోహరించి, తాత్కాలికంగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎమ్మెల్యే అభిమన్యు పూనియాతో సహా పలువురు నిరసనకారులు గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, ఫ్యాక్టరీ నిర్మాణం ఆపాలని మరియు అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని నిరసనకారులు తమ డిమాండ్లను కొనసాగిస్తున్నారు.






