- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Civils-2024 Results: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. సివిల్స్-2024 తుది ఫలితాలు విడుదల
దిశ, వెబ్‌డెస్క్: సివిల్స్ - 2024 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ మేరకు తుది ఫలితాలను యూపీఎస్సీ కాసేపటి క్రితం విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: సివిల్స్-2024 (Civils-2024) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ మేరకు తుది ఫలితాలను యూపీఎస్సీ (UPSC) కాసేపటి క్రితం ప్రకటించింది. అయితే, తాజాగా వెలువడిన ఫలితాల్లో శక్తి దూబే (Shakti Dube)కు మొదటి ర్యాంకు, హర్షిత గోయల్‌కు రెండో ర్యాంక్, పరాగ్ మూడో ర్యాంక్ సాధించారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన సాయి శివాని (Sai Shivani) 11వ ర్యాంకు, బన్నా వెంకటేశ్ (Banna Venkatesh) 15వ ర్యాంకు సాధించారు. అదేవిధంగా శ్రవణ్ కుమార్ రెడ్డి (Sravan Kumar Reddy) 62, సాయి చైతన్య జాదవ్ (Sai Chaithaya Jadav)కు 68 ర్యాంక్. చేతన రెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119, సి.పవన్ కల్యాణ్ 146, ఎన్ శ్రీకాంత్ రెడ్డి 151, సాయి తేజ 154, కొలిపాక శ్రీకృష్ణ సాయి 190 ర్యాంక్ సాధించారు.
కాగా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో UPSC నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుల చేసింది. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి అందులో క్వాలిఫై అయిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్ ఉత్తీర్ణులైన వారికి వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించి ఇవాళ UPSC తుది ఫలితాలను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్‌కు మొత్తం వివిధ కేటగిరిలో 1,009 మంది ఎంపికయ్యారు. అందులో జనరల్ కేటగిరి నుంచి 335 మంది, EWS-109, OBC-318, SC-160, ST కేటగిరీ నుంచి 87 మంది సెలెక్ట్ అయ్యారు. ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్ఎస్‌కు 55 మంది, IPSకు 147 మంది ఎంపికయ్యారు.
దేశ వ్యాప్తంగా టాప్-10 ర్యాంకుల్లో నిలిచిన అభ్యుర్థులు వీరే..
1. శక్తి దూబే
2. హర్షిత గోయెల్
3. డోంగ్రే అర్చిత్ పరాగ్
4. షా మార్గి చిరాగ్
5. ఆకాశ్ గార్గ్
6. కోమల్ పూనియా
7. ఆయుషి బన్సల్
8. రాజ్‌కృష్ణ ఝా
9. ఆదిత్య విక్రమ్ అగర్వాల్
10. మయాంక్ త్రిపాఠి






