- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
POK: అక్కడ ఆకలికేకలు.. వాళ్ల చేతుల్లో పోలీసు మృతి..
గదిలో బంధించి హింసంస్తే పిల్లి కూడా పులిలా తిరగబడుతుంది.

దిశ వెబ్ డెస్క్: గదిలో బంధించి హింసంస్తే పిల్లి కూడా పులిలా తిరగబడుతుంది. సహిస్తున్నారు కదా అని అనిచివేయాలని చేస్తే అరచేయి ఆయుధంగా మారుతుందని అనడానికి పాక్ ఆక్రమిత కశ్మీర్ నిదర్శనం. ప్రస్తుతం పీఓకే చావుకేకలతో నిద్రలేస్తోంది. ఆకలి పేగుల ఆర్తనాధాలతో, చావుకేకలతో పీఓకే దద్దరిల్లిపోతోంది. అధికారులకు, అభాగ్యలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 90 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అయుతే తాజాగా ఓ పోలీస్ అధికారిని అవామీ యాక్షన్ కమిటీ ఆందోళనకారుల చంపేశారు. కాగా ఇప్పటికి అవామీ యాక్షన్ కమిటీ ఆందోళనకారుల్లో ఎంతోమంది అరెస్ట్ అయ్యారు. దీనితో ఆ ప్రాంతంలో వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి. ఆందోళనకారులను అదుపు చేయడానికి ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. అలానే ఏకే-47తో కాల్పులు జరపింది. ఈ కాల్పుల్లో ఇద్ధరు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు.
అవామీ యాక్షన్ కమిటీ ఏం డిమాండ్ చేస్తోంది..?
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ద్రవ్యోల్బణం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. దీనితో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక మంగ్లా డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తమకు ఉచితంగా ఇవ్వాలని, అలానే గోధుమలపై రాయితీలు కల్పించాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది.
దీనితో ఆగ్రహానిలోనైన పీఓకే ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో ప్రజల తిరుగుబాటును అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో పీవోకేలో ఉద్యమకారుడు అంజాద్ అయుబ్ మిర్జా మాట్లాడుతూ.. ప్రభుత్వం బలగాలు నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరుపుతున్నాయని మండిపడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలానే ఇక్కడ పరిస్థితి చేజారిపోయిందని, భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని, తమకి స్వాతంత్ర్యం కల్పించాలి కోరారు.






