కన్నీరు పెట్టిస్తోన్న సివిల్ సర్వీసెస్ అభ్యర్థి ఆత్మహత్య

by Gantepaka Srikanth |
కన్నీరు పెట్టిస్తోన్న సివిల్ సర్వీసెస్ అభ్యర్థి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగాల కోసం చూసి చూసి నోటిఫికేషన్లు రాక ఇటీవల కాలంలో అనేక మంది నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలు రోజు ఎక్కడో ఒక చోట వెలుగుజూస్తూనే ఉన్నాయి. తాజాగా సివిల్ సర్వెంట్ కావాలనే లక్ష్యంతో రేయింబవళ్లు కష్టపడి శ్రమించిన ఓ యువతి ఒత్తిడికి బలైపోయింది. ఢిల్లీలో శిక్షణ పొందుతున్న అంజలి అనే యువతి మూడు అటెంప్ట్‌లు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో కుంగిపోయిన యువతి.. తల్లదండ్రులు తనను క్షమించాలని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నది. ప్రయివేట్ హాస్టల్స్ యాజమాన్యాలు రెంట్‌ల రూపంలో రక్తం పీల్చుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయి ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకున్నదని పోలీసులు అనుమానిస్తున్నారు.



Next Story

Most Viewed