చరిత్రలో మొదటి సారి CISF అతిపెద్ద క్రీడా నియామకాలు

by Malleboina Mahesh |

2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్, అంతకు మించి ప్రపంచ పోడియంలపై భారతదేశం ఉనికిని పెంచడమే లక్ష్యంగా సీఐఎస్ఎఫ్ 332 మంది అథ్లెట్లను నియమించింది.

చరిత్రలో మొదటి సారి CISF అతిపెద్ద క్రీడా నియామకాలు
X

దిశ, వెబ్ డెస్క్: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (Central Industrial Security Force) అతిపెద్ద క్రీడా నియామకాలు చేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్స్, అంతకు మించి ప్రపంచ పోడియంలపై భారతదేశం ఉనికిని పెంచడమే లక్ష్యంగా 332 మంది అథ్లెట్లను నియమించినట్లు తెలుస్తుంది. కాగా ఈ నియామకాలు CISF లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద క్రీడా నియామకాలుగా నిలిచాయి. ఈ 332 మంది అథ్లెట్లలో రికార్డు స్థాయిలో 179 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. 14,000 కంటే ఎక్కువ దరఖాస్తుల నుండి ఈ అథ్లెట్లను ఎంపిక చేశారు. ఎంపికైన అథ్లెట్లందరూ జాతీయ స్థాయి పతక విజేతలు ఉన్నారు. వారిలో 18 మంది అంతర్జాతీయ స్థాయి బంగారు పతక విజేతలు, 56 మంది జాతీయ స్థాయి బంగారు పతక విజేతలు ఉన్నట్లు CISF అధికారులు తెలిపారు.

Next Story