- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కదిలితే కాల్చేస్తా.. జ్యువెల్లరీ షాపులో సినిమాటిక్ స్టైల్ దొంగతనం.. క్షణాల్లో 18లక్షల విలువైన బంగారం చోరీ..
బెంగళూరులోని ఓ జ్యువెల్లరీ షాపులో సినిమాటిక్ స్టైల్‌లో చోరీ జరిగింది. మదనాయకనహళ్లి ప్రాంతం మాగడి రోడ్డులోని రామ్ జ్యువెల్లర్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. షాపు క్లోజింగ్ టైమ్‌లో... యజమాని, ఉద్యోగులు అంతా సెట్ చేసుకుంటుండగా.

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులోని ఓ జ్యువెల్లరీ షాపులో సినిమాటిక్ స్టైల్‌లో చోరీ జరిగింది. మదనాయకనహళ్లి ప్రాంతం మాగడి రోడ్డులోని రామ్ జ్యువెల్లర్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. షాపు క్లోజింగ్ టైమ్‌లో... యజమాని, ఉద్యోగులు అంతా సెట్ చేసుకుంటుండగా.. ఎంటర్ అయ్యారు ముగ్గురు ముసుగు దొంగలు. సినిమాలో మాదిరిగానే తుపాకీతో బెదిరించి అందినకాడికి దోచుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ CCTVలో రికార్డ్ అయ్యాయి.
కదిలితే కాల్చేస్తాను అంటూ అరుస్తూ బెదిరించి.. సుమారు 18 లక్షల రూపాయల విలువైన 184 గ్రాముల బంగారాన్ని దోచుకున్నారు. దొంగలు ఉద్యోగులను పక్కకు నెట్టి.. టేబుల్‌పైకి ఎక్కి డిస్‌ప్లే కేసుల నుంచి ఆభరణాలను కొట్టేశారు. ఈ సినిమా స్టైల్ దోపిడీ జస్ట్ నిమిషాల్లోనే ముగిసింది. ఆ తర్వాత పరారయ్యారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. CCTV ఫుటేజీని ఆధారంగా చేసుకుని దొంగలను గుర్తించే పనిలో ఉన్నారు.






