లోన్‌లే కాదు.. ఉద్యోగానికి సిబిల్ స్కోరు ముఖ్యమే!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-27 10:28:31  IST  )

సాధారణంగా సిబిల్ స్కోరును రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించే వారికి ముఖ్యమైనది.

లోన్‌లే కాదు.. ఉద్యోగానికి సిబిల్ స్కోరు ముఖ్యమే!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా సిబిల్ స్కోరును రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించే వారికి ముఖ్యమైనది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇటీవల ఓ పెళ్లి కొడుకుకి సిబిల్ స్కోరు బాగా లేదనే కారణంతోనే పెళ్లి రద్దవడం తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి మరో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, ఈసారి సిబిల్ స్కోరు ఉద్యోగం పొందే విషయంగా కీలక పాత్ర పోషించింది. ఓ వ్యక్తి తక్కువ సిబిల్ స్కోరు కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్లితే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుకు ఒక అభ్యర్థిని ఎంపిక చేసింది. అయితే అనంతరం తన సిబిల్ స్కోర్ పరిశీలించగా, అతను క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు చెల్లించకుండా ఉండటంతో నియామకాన్ని రద్దు చేసింది. దీనిపై ఆ అభ్యర్థి మాద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దాన్ని పరిశీలించిన మద్రాస్‌ హైకోర్లు ఎస్‌బీఐ చర్యలను సమర్థించింది.

దరఖాస్తు సమయంలో ఎలాంటి రుణ బకాయిలు లేకూడదని నిబంధనల్లోనే పేర్కొనబడిందని ఎస్‌బీఐ తరఫు న్యాయవాది వాదించారు. ప్రజాధనాన్ని నిర్వహించే వ్యక్తి ఆర్థిక నైతికతతో ఉండాలని, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నది వారి ఉద్దేశమని చెప్పారు. జస్టిస్‌ ఎన్‌.మాలా ఈ వాదనను సమర్థిస్తూ ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఉద్యోగాలకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం అన్నారు. నియామకానికి ముందే బకాయిలు చెల్లించినట్లు అభ్యర్థి పేర్కొన్నప్పటికీ క్లీన్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ అనేది కేవలం రుణ క్లియరెన్స్ మాత్రమే కాదని, దాన్ని నియామకాల్లో బెంచ్ మార్క్‌గా పరిగణిస్తారని కోర్టు నొక్కి చెప్పింది. అనంతరం ఎస్‌బీఐ తీసుకున్న నియామక రద్దు చర్య చట్టబద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది.

Next Story