USA: అమెరికా ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ అయిన సీఐఏపై ట్రంప్ నజర్

by Shamantha N |

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతలు విధిస్తూనే ఉన్నారు. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ కు ముఖ్యమైన సీఐఏపై ట్రంప్ నజర్ పడింది.

USA: అమెరికా ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ అయిన సీఐఏపై ట్రంప్ నజర్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతలు విధిస్తూనే ఉన్నారు. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ కు ముఖ్యమైన సీఐఏపై ట్రంప్ నజర్ పడింది. ఆ సంస్థలోని ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ విషయాన్ని సీఎన్‌ఎన్‌కు వెల్లడించారు. అమెరికాలో ప్రభుత్వోద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ట్రంప్‌ కార్యవర్గం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి. ఈవిషయాన్నే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో పేర్కొంది. ఇటీవలే, ప్రభుత్వ ఉద్యోగులపై ట్రంప్ సర్కారు వేటు వేసింది. కానీ, ఈ ఆఫర్‌లో జాతీయభద్రతతో సంబంధం ఉన్న సంస్థలను అప్పట్లో చేర్చలేదు. కాకపోతే, సీఐఏ కొత్త డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్‌ మాత్రం ఈ ఆఫర్‌లో సీఐఏ కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ ఆఫర్‌ను ఉద్యోగులకు తెలియజేశారా, లేదా అన్నదానిపైనా, అలాగే ఎవరెవరికి వర్తిస్తాయనే అంశాలపైనా స్పష్టత లేదు.

సీఎన్‌ఎన్‌ కథనం

ఇటీవలే, అమెరికాలోని ది ఆఫీస్‌ ఆఫ్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి ది డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌లోని కొందరు ఉద్యోగులకు ఈ కార్యక్రమంలో భాగం కావాలని మార్గదర్శకాలు వెళ్లినట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొంది. సీఏఐలోని కొందరు కీలక ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్లు డీప్‌స్టేట్‌లో భాగమయ్యారని ట్రంప్‌, ఆయన సన్నిహితులు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. దీనికితోడు సీఐఏ సమాచార సేకరణ, విశ్లేషణలో కొన్ని విభాగాలు భారీగా ఖర్చు చేస్తున్నాయని కూడా భావిస్తున్నారు. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ట్రంప్‌ ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా ఉద్యోగం వదులుకుంటే వారికి 8 నెలల జీతాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించేందుకు గతనెల ఒక మెమో వెలువడింది. దాదాపు 20 లక్షల మంది ఉద్యోగులకు మెయిల్ వెళ్లింది.దీనికి మంగళవారం వరకు గడువు విధించారు.

Next Story