- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ అణుస్థావరాలపై దాడులను ఇందిర అడ్డుకున్నారు: సీఐఏ మాజీ అధికారి
by Phanindra |
పాక్ అణుస్థావరాలపై దాడులు చేయబోతే ఇందిర ఆపించేశారని సీఐఏ మాజీ అధికారి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ అణుస్థావరాను ధ్వంసం చేసే అవకాశం వచ్చినా భారత్ దాన్ని ఉపయోగించుకోలేదని మాజీ సీఐఏ అధికారి రిచర్డ్ బార్లో వెల్లడించారు. 1980లో భారత్, ఇజ్రాయెల్ కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టగా.. పాకిస్తాన్‌లోని కహుటా న్యూక్లియర్ ఫెసిలిటీపై దాడి చేయకుండానే ఇజ్రాయెల్ వినమానాలు వెనుదిరిగాయని బార్లో తెలిపారు. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఈ దాడులు చేయడానికి అనుమతించలేదని, నిజంగా ఆ నిర్ణయం వృధా అని తనకు అనిపించిందని చెప్పు కొచ్చాురు. ‘1982 నుంచి 1985 వరకు నేను ప్రభుత్వంలో లేను. నేను సర్వీసులో లేన్పుడే ఈ ఘటన జరిగి ఉండొచ్చు. ఆ తర్వాతే ఈ విషయం నాకు తెలిసింది. కానీ అసలేం జరిగిందో మొత్తం వివరాలు నాక తెలియదు. ఇందిరా గాంధీ నిర్ణయం నిజంగా చాలా బాధాకరం. ఆ దాడి జరిగి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించేది’ అని బార్లో వివరించారు.
Next Story






