- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నస్వామి తొక్కిసలాట కేసు.. RCB మార్కెటింగ్ హెడ్ అరెస్ట్
RCB విజయోత్సవం సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీస్ డిపార్ట్‌మెంట్ విచారణను వేగవంతం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: RCB విజయోత్సవం సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీస్ డిపార్ట్‌మెంట్ విచారణను వేగవంతం చేసింది. ఈ మేరకు ఆర్సీబీ టీమ్ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలెను పోలీసులు ఇవాళ ఉదయం బెంగళూరు ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అతడు ముంబాయ్‌కి వెళ్తుండగా చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఈవెంట్ నిర్వాహక సంస్థ DNA ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆర్సీబీ టీమ్ మేనేజ్‌మెంట్ నిఖిల్ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఈవెంట్‌ను కూడా DNA సంస్థతో కలిసి ఆయనే ఏర్పాటు చేసినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
కాగా, బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటపై గురువారం కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లక్షల మంది క్రీడాభిమానులతో ముడిపడిన కార్యక్రమాన్ని నిర్వహించటంలో ఫెయిల్ అయింది ఎవరో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తొక్కిసలాట ఘటనపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.కామేశ్వర్‌రావు, జస్టిస్ సి.ఎం.జోషిల ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేసుకుని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వచ్చే మంగళవారంలోగా తొక్కిసలాట ఘటనపై పూర్తి నివేదికను కోర్టుకు అందజేయాలని ఆదేశించింది.






