- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నస్వామి తొక్కిసలాట ఘటన.. సుమోటోగా స్వీకరించిన కర్ణాటక హైకోర్టు
బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ (RCB) విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు (Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ (RCB) విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇవాళ మధ్యాహ్నం 2.30కి తొక్కిసలాట కేసుపై విచారణను ప్రారంభించనుంది. కాగా, బుధవారం జరిగిన తొక్కిసలాటలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ మేరకు వైద్య శాఖ మృతదేహాలకు పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తి చేసి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించింది.
మృత్యు ద్వారం గేట్ నెంబర్ 7..
ఆర్సీబీ విజయోత్సవ వేడకకు చిన్నస్వామి స్టేడియం వేదికైంది. అయితే, ఆ స్టేడియం కెపాసిటీ కేవలం 35 వేలు మాత్రమే. కానీ విజయోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది హాజరైనట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి. చిన్నస్వామి స్టేడియంలో మొత్తం 21 స్టాండ్‌లు ఉండగా 13 గేట్లు ఉన్నాయి. ఇందులో 9, 10వ నంబర్ గేట్లను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు. 5, 6, 7 గేట్ల నుంచి అభిమానులకు స్టేడియం లోపలికి అనుమతించారు. గేట్ నెంబర్ 7 చిన్నస్వామి స్టేడియంకు ఎంట్రెన్స్ కావడంతో లోపలికి వచ్చే ప్లేయర్ల వ్యూ స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆ గేటు వద్దకు అభిమానులు ఒక్కసారిగా పరుగులు తీశారు. అనంతరం జరిగిన తొక్కిసలాటలో ఊపిరి ఆడక మొత్తం 11 మంది ఆర్సీబీ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.






