- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
China: సూది గుచ్చుకుంది.. మానసికి వేదనకు గురయ్యా.. ఎయిర్ లైన్స్ పై వ్యక్తి దావా
విమానాల్లో ప్రయాణికులకు ఛేదు అనుభవాలు ఎదురవుతున్న ఘటనలు ఈ మధ్య తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. కాగా.. చైనాకు చెందిన ఫూ అనే వ్యక్తికి చైనా సదర్న్ ఎయిర్ లైన్స్ లో (China Southern Airlines) ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ఎదురయ్యింది.

దిశ, నేషనల్ బ్యూరో: విమానాల్లో ప్రయాణికులకు ఛేదు అనుభవాలు ఎదురవుతున్న ఘటనలు ఈ మధ్య తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. కాగా.. చైనాకు చెందిన ఫూ అనే వ్యక్తికి చైనా సదర్న్ ఎయిర్ లైన్స్ లో (China Southern Airlines) ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ఎదురయ్యింది. కూర్చున్న సీటులో సిరెంజ్ లో వాడేసిన సూది గుచ్చుకుందని అతడు కోర్టుని ఆశ్రయించాడు. ఈ ఘటన వల్ల మానసిక క్షోభకు గురయ్యానని చెప్పుకొచ్చాడు. అయితే, ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత బాధితుడికి ఎయిర్ లైన్స్ కొంత మొత్తం పరిహారం ఇచ్చింది. టికెట్ ధరను వాపస్ కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఫూ ఇంకా కొంత మొత్తన్నా ఎయిర్ లైన్స్ నుంచి డిమాండ్ చేశాడు. భవిష్యత్ లో చికిత్స కోసం ఖర్చును భరించాలని కోరాడు. అందుకు 1,30,000 (రూ. 15 లక్షలకు పైగా) యువాన్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. కాగా.. ఈ డిమాండ్ ను ఎయిర్ లైన్స్ నిరాకరించింది. దీంతో, అతడు కోర్టుని ఆశ్రయించాడు. చైనా సదర్న్ ఎయిర్ లైన్స్ పై దావా వేశాడు. ఆ తర్వాత బాధితుడి డిమాండ్లను ఎయిర్ లైన్స్ అంగీకరించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అంతేకాకుండా, జరిగిన తప్పుకు క్షమాపణలు కూడా కోరింది. పయాణికులకు ఎలాంటి హాని కలిగించకుండా పరిశుభ్రత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలో పేర్కొంది. ఫూ వైద్య ఖర్చులను కూడా భరిస్తామని వెల్లడించింది.
సూది గుచ్చుకుని..
చైనా సదర్న్ ఎయిర్ లైన్స్ లో (China Southern Airlines) ఫూ అనే వ్యక్తి ప్రయాణించాడు. అయితే, సీటులో కూర్చొన్నప్పుడు తన ప్యాంటు పాకెట్ నుంచి సెల్ ఫోన్ తీసుకునేందుకు యత్నించాడు. అయితే, అతడి వేలికి పదునైన వస్తువు ఏదో గుచ్చుకున్నట్లు అన్పించింది. దాన్ని ఇన్సులిన్ ఇంజక్షన్‌కు వాడిన సూదిగా గుర్తించాడు. వెంటనే ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఆ విషయాన్ని తెలియజేశాడు. ఫూ కు సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ చేశారు. అయితే, అంతకుముందు ఆ సీటులో కూర్చున్న ప్యాసింజర్ ఇంజెక్షన్ ను వదిలి వెళ్లినట్లు దర్యాప్తులో తేలిందని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.






