నేపాల్ గుండా భారత్‌లో ప్రవేశం.. చైనీయులకు ఆ దేశం వార్నింగ్

by Phanindra |

నేపాల్ గుండా భారత్‌లో ప్రవేశిస్తున్న చైనీయులు. వీసా లేకపోతే 8 ఏళ్లు జైలు తప్పదని హెచ్చరించిన చైనీస్ ఎంబసీ.

నేపాల్ గుండా భారత్‌లో ప్రవేశం.. చైనీయులకు ఆ దేశం వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: నేపాల్ గుండా భారత్‌లో ప్రవేశిస్తున్న చైనీయులకు ఆ దేశ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. ఇటీవలి కాలంలో అక్రమంగా భారత్‌లో ప్రవేశిస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితమే ఇలా అక్రమంగా భారత్‌లో అడుగుపెట్టిన నలుగురు చైనీయులను కూడా పాక్ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్, నేపాల్ బోర్డర్‌కు చైనీయులు వెళ్లొద్దని నేపాల్‌లోని చైనా ఎంబసీ నిర్దేశించింది. నేపాల్, భారత పౌరులు ఈ బోర్డర్‌ను స్వేచ్ఛగా దాటతారని, కానీ ఇతర దేశస్థులకు ఈ రూల్ వర్తించదని చైనా ఎంబసీ తన ప్రకటనలో తెలిపింది. సరైన వీసా లేకుండా నేపాల్ గుండా భారత్‌లో ప్రవేశిస్తే 2 నుంచి 8 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కేసుల్లో బెయిల్ కూడా రాదని పేర్కొంది.

Next Story