భారత్‌పై యూఎస్ సుంకాలు ఖండిస్తున్నాం: చైనా రాయబారి

by Phanindra |

భారత్‌పై యూఎస్ సుంకాలను ఖండిస్తున్నామని, నిశ్శబ్దంగా ఉంటే బలవంతుడికి మద్దతిచ్చినట్లేనని చైనా రాయబారి షూ ఫేహాంగ్ అన్నారు.

భారత్‌పై యూఎస్ సుంకాలు ఖండిస్తున్నాం: చైనా రాయబారి
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై యూఎస్ అదనపు సుంకాలు వేయడాన్ని ఖండిస్తున్నట్లు చైనా రాయబారి షూ ఫేహాంగ్ అన్నారు. యూఎస్ బలప్రదర్శన చేస్తోందన్న ఆయన.. స్వేచ్ఛా వాణిజ్యంతో బాగా లాభపడిన అమెరికా, ఇప్పుడు సుంకాలను ఆయుధంగా మార్చుకుందని విమర్శించారు. ఇలాంటి సమయంలో గళమెత్తకపోతే బలవంతుడికి సాయం చేసినట్లేనని, అందుకే ఈ విషయంలో తాము పూర్తిగా భారత్‌కు మద్దతిస్తున్నామని ఫేహాంగ్ స్పష్టంచేశారు.

భారత్, చైనా దేశాలు మార్కెట్లలో ఉత్పత్తులను పంచుకుంటే ఎంతో అభివృద్ధి చెందుతాయని అన్నారు. ‘భారత వస్తువులను చైనా మార్కెట్లోకి మేం ఆహ్వానిస్తున్నాం. ఐటీ, సాఫ్ట్‌వేర్, బయోమెడిసిన్ రంగాల్లో భారత్‌‌ది కొంత పైచేయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, మౌలిక సదుపాయాల నిర్మాణం, న్యూ ఎనర్జీ రంగాల్లో చైనా వేగంగా వ్యాపిస్తోంది. ఈ రెండు మార్కెట్లు కలిస్తే భారీగా ప్రయోజనాలుంటాయి’ అని ఫేహాంగ్ వివరించారు. చైనాలో భారత్ పెట్టుబడులు పెట్టాలని, అదే సమయంలో చైనా కంపెనీలకు భారత్‌లో వివక్ష లేని, న్యాయమైన వాతావరణం అందించాలని ఆయన కోరారు.

Next Story