'భారత్'పై.. చైనా 'వాటర్ బాంబ్'.!

by Geesa Chandu |

యుద్ధం చేయడానికి తుపాకులు అవసరం లేదు, బాంబులు అవసరం లేదు, అణుబాంబులు అంతకన్నా అవసరం లేదు. కేవలం వాటర్ ఉంటే చాలు.!

భారత్పై.. చైనా వాటర్ బాంబ్.!
X

దిశ, వెబ్ డెస్క్: యుద్ధం చేయడానికి తుపాకులు అవసరం లేదు, బాంబులు అవసరం లేదు, అణుబాంబులు అంతకన్నా అవసరం లేదు. కేవలం వాటర్ ఉంటే చాలు.! దాన్నే బాంబులా ప్రయోగించి శత్రువును నాశనం చేయవచ్చు. మానవత్వం లోపించిన వాళ్ళే ఈ పనిని చేయగలరు. ఈ విషయంలో చైనా రెండు ఆకులు ఎక్కువే తిన్నది. అందుకే మన దేశంపై వాటర్ బాంబ్ ను ప్రయోగించడానికి చైనా సిద్ధం అయింది. ఇప్పుడు దీనికి బ్రహ్మపుత్ర నదిని అడ్డు పెట్టుకుంది. అవకాశం దొరికితే చాలు మనపై ఎప్పుడు విషం చిమ్ముదామా అని వేచి చూస్తూ ఉంటుంది. అందుకే మన దేశానికి సరిహద్దులో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతుంది చైనా.! మనల్ని నిరంతరం రెచ్చగొట్టేలా కవ్విస్తూనే ఉంటుంది. మనతో యుద్ధం చేయడానికి మన బోర్డర్ ను ఆనుకొనే పలు నిర్మాణాలను చేపట్టింది. అయితే.. ఈ వాటర్ బాంబ్ గురించి మాత్రం ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ అనగా.. ASPI వారు ఇచ్చిన ఒక రిపోర్ట్ ను చూస్తే మనకు అదే అర్ధమవుతుంది. బ్రహ్మపుత్ర నది ద్వారా మనపై వాటర్ బాంబ్ ప్రయోగించే విషయంలో చైనా కుయుక్తులు ఎలా ఉంటాయో ఈ రిపోర్ట్ ను చూస్తే మనకు ఇట్టే అర్ధమవుతుంది.

Next Story