China: భారత్ నుంచి మరిన్ని ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటాం.. చైనా రాయబారి జు ఫీహాంగ్

by B.Srinivas |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే సుంకాల భయంతో చైనా కీలక నిర్ణయం తీసుకుంది.

China: భారత్ నుంచి మరిన్ని ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటాం.. చైనా రాయబారి జు ఫీహాంగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించే సుంకాల భయంతో చైనా (China) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి మరిన్ని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని యోచిస్తోంది. ఇండియాలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ (Ju feehang) ఓ వార్త కథనంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘వాణిజ్యం, ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చైనా మార్కెట్‌కు అనుకూలంగా ఉండే మరిన్ని భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉన్నాం’ అని తెలిపారు. వాణిజ్య సహకారానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ట్రంప్ పరస్పర సుంకాలను విధించనున్న నేపథ్యంలోనే చైనా రాయబాది ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో ట్రంప్ సుంకాల బెదిరింపు ఇద్దరు శత్రువులను స్నేహితులుగా మారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వైట్ హౌస్‌లోని రోజ్ గార్డెన్‌లో జరిగే కార్యక్రమంలో సుంకాల విధింపుపై ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ అన్ని దేశాలపై పరస్పర సుంకాలు విధిస్తామని చెప్పారు. కొన్ని దేశాలను సుంకాల నుంచి మినహాయించవచ్చనే ఊహాగానాలు సైతం వెలువడుతున్నాయి. దీంతో ట్రంప్ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story