- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్‌కు 40 చైనీస్ స్టెల్త్ జెట్లు.. భారత్‌కు టెన్షన్ తప్పదా?
పాక్‌కు 40 స్టెల్త్ జెట్లు డెలివరీ చేయడానికి చైనా రెడీ అయింది. ఇది భారత్‌ను టెన్షన్ పెట్టే అంశమేనని మాజీ ఐఏఎఫ్ అధికారి అంటున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ కనీసం 40 జే35 స్టెల్త్ ఫైటర్ జెట్స్‌ను చైనా సప్లయ్ చేసేందుకు రెడీ అయింది. దీంతో భారత్‌కు కొంత ఇబ్బంది తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిటైర్డ్ ఐఏఎఫ్ గ్రూప్ కమాండర్ అజయ్ అహ్లావత్ ఈ విషయంపై స్పందించారు. పాక్ పైలట్లు ఆరు నెలలుగా చైనాలో శిక్షణ తీసుకుంటున్నారని, కాబట్టి దాయాది దేశం ఈ జెట్లు కొనుగోలు చేయడంలో ఆశ్చర్యం ఏం లేదన్నారు. అయితే ఈ ఏడాది డిసెంబరు కల్లా డెలివరీ పూర్త చేసేందుకు చైనా సిద్ధం అవడమే భారత్‌కు కొంత ఆందోళన కలిగిస్తుందని తెలిపారు.
అయితే చైనా నుంచి పూర్తి జే35 జెట్లు పాక్‌కు వెళ్లవని, ఏ దేశమూ తమ పూర్తి వెర్షన్‌ను విదేశాలకు అమ్మదని ఆయన వివరించారు. జే35లో కొన్ని మార్పులతో తయారు చేసిన ఎక్స్‌పోర్ట్ వేరియంట్ ఎఫ్‌సీ31ను పాక్‌కు పంపుతారని చెప్పారు. అయితే భారత్ వద్ద స్టెల్త్ విమానాలే లేవని, ఉన్న ఏకైక ఆప్షన్ ఆమ్కా (ఏఎంసీఏ)ను వేగంగా సిద్ధం చేయడమేనని అన్నారు. ఆమ్కా పూర్తి చేయడానికి కనీసం మరో పదేళ్లు పడుతుందన్న ఆయన.. జాతీయ స్థాయి మిషన్‌గా దీనికి ప్రాముఖ్యత ఇచ్చి, సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు.






