China Tariff: చైనాపై 145 శాతం టారిఫ్స్.. వెల్లడించిన వైట్ హౌస్

by B.Srinivas |

అమెరికా చైనాల మధ్య సుంకాల యుద్ధం ఆగడం లేదు. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చైనాపై 125 శాతం టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే.

China Tariff: చైనాపై 145 శాతం టారిఫ్స్.. వెల్లడించిన వైట్ హౌస్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా చైనా (America china) ల మధ్య సుంకాల (Tarrifs) యుద్ధం ఆగడం లేదు. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇప్పటికే చైనాపై 125 శాతం టారిఫ్స్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఫెంటానిల్ అక్రమ రవాణాలో చైనా పాత్ర ఉందనే ఆరోపణలతో ఈ ఏడాది ప్రారంభంలో ప్రత్యేకంగా 20 శాతం సుంకం విధించారు. దీంతో చైనా ఉత్పత్తులపై మొత్తంగా టారిఫ్స్ 145 శాతానికి చేరుకున్నట్టు వైట్ హౌస్ గురువారం వెల్లడించింది. ఈ నిర్ణయంతో చైనాకు భారీ షాక్ తగిలినట్టు అయింది. ఈ టారిఫ్స్ వల్ల చైనా ఉత్పత్తులు అమెరికాలో ఎక్కువ ధరలకు అమ్ముడవుతాయి.

అంతకుముందు ట్రంప్ పలు దేశాలపై 90 రోజుల పాటు టిట్ ఫర్ టాట్ నిలిపివేశారు. కానీ ఈ మినహాయింపులో చైనాను చేర్చలేదు. అంతేగాక సుంకాలను 104శాతం నుంచి 125శాతానికి పెంచారు. చైనా ప్రతీకారంగా 84 శాతం సుంకం విధించిన అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం ఏ స్థాయికి చేరుకుంటుందోనని సర్వత్రా ఆందోళన నెలకొంది.

Next Story